అమ్మ లేకుండానే పాకిస్తాన్ పోతున్నాం! భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో హృదయవిదారక దృశ్యాలు

by Ramesh Naini |   (  Updated:2025-04-28 10:13:34  IST  )

జమ్మూకాశ్మీర్‎లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే.

అమ్మ లేకుండానే పాకిస్తాన్ పోతున్నాం! భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో హృదయవిదారక దృశ్యాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూకాశ్మీర్‎లో పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) తర్వాత పాకిస్తాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 27 లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. దీంతో చాలా మంది పాకిస్తాన్ పౌరులు తమ దేశం వెళ్లిపోవడానికి భారత్-పాకిస్తాన్ (India-Pakistan border) సరిహద్దుల్లో క్యూలు కట్టారు. వారి వీసాలు, డాక్యుమెంట్లను చెక్ చేసి అధికారులు వారిని పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక చిక్కు వచ్చి ఏర్పడింది. చాలా మంది భారత ముస్లిం యువతులు పాకిస్తాన్ పౌరులను పెళ్లి చేసుకున్నారు. అయితే వారు పెళ్లిలు చేసుకోని ఏళ్లు గడుస్తున్నా భారత పాసుపోర్టులను మాత్రమే కలిగి ఉన్నారు. చాలా మంది పాకిస్తాన్ పౌరసత్వం తీసుకోన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు వారికి పుట్టిన పిల్లలకు పాక్ పౌరసత్వం, ఆ దేశ పాస్ పోర్టులను కలిగి ఉన్నారు. అయితే పాక్ పాసుపోర్టు లేని మహిళలను అధికారులు పాకిస్తాన్ పంపించట్లేదు. దీంతో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో హృదయవిదారక దృశ్యాలు (Heartbreaking scenes) కనిపించాయి.

తమను కూడా పాకిస్తాన్ పంపించి వేయాలని కొత్తగా పెళ్లి అయిన జంట నుంచి పదేళ్లకు పైగా పెళ్లై జీవిస్తున్న మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్తను పిల్లలను వదిలి ఉండలేమని ప్రభుత్వం తమను ఆదుకోవాలని చాలా మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎంత మంది భారత ముస్లిం మహిళలు పాకిస్తాన్‌కు చెందిన పౌరులను పెళ్లిచేసుకున్నారనేది అధికారులు వివరాలు వెల్లడించలేదు.

ఈ నేపథ్యంలో హృదయవిదారక దృశ్యాలు చోటు చేసుకున్నాయి. 11 ఏళ్ల జైనబ్, 8 ఏళ్ల జెనీశ్ లాంటి చిన్నపిల్లలు తమ తల్లులను విడిచిపెట్టి పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే వారి తల్లులు భారత పాసుపోర్టులు కలిగి ఉన్నారు. ఈ క్రమంలోనే అమ్మను విడిచి 11 ఏళ్ల పాక్ అమ్మాయి కన్నీలు పెట్టుకుంటూ పాకిస్తాన్ వెళ్లిపోయింది. ‘నా తల్లిని వదిలి వెళ్లడం చాలా కష్టం.. నేను ఢిల్లీలో ఉన్న నానీని కలవడానికి ఇక్కడికి వచ్చాను, కానీ ఇప్పుడు మేము నా తల్లి లేకుండానే తిరిగి వెళ్తున్నాము ఎందుకంటే ఆమెకు భారతీయ పాస్‌పోర్ట్ ఉంది, మేము పాకిస్తానీలు’ అని జైనాబ్ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, గత నాలుగు రోజుల్లో మొత్తం 537 మంది పాక్ పౌరులు అటారీ వాఘా బోర్డర్ గుండా తమ దేశానికి వెళ్లిపోయారని అధికారులు నిన్న ప్రకటించారు. కొందరు విమానాల్లో వేరే దేశాల మీదుగా వెళ్లినట్టు తెలిపారు. మెడికల్ వీసాలపై వచ్చిన పాక్ పౌరులకు మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు ఈ నెల 29 (రేపటి) వరకు గడువు ఉన్న విషయం తెలిసిందే.

Next Story