- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > Law Commission: లా కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ దినేష్ మహేశ్వరి.. న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడి
Law Commission: లా కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ దినేష్ మహేశ్వరి.. న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడి
by B.Srinivas |
23వ లా కమిషన్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: 23వ లా కమిషన్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి (Dinesh Maheshwari)ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు న్యాయమంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘న్యాయ వ్యవహారాల శాఖ ప్రతిపాదన మేరకు 23వ భారత లా కమిషన్ చైర్మన్ గా జస్టిస్ దినేష్ మహేశ్వరి, సభ్యులుగా హితేష్ జైన్, ప్రొఫెసర్ డీపీ వర్మల నియామకానికి ప్రధాని మోడీ ఆమోదం తెలిపారు. దీంతో వారు బాధ్యతలు చేపట్టారు’ అని వెల్లడించింది. కాగా, 23వ లా కమిషన్‌ను గతేడాది సెప్టెంబర్ 3న మూడేళ్ల కాలపరిమితితో ఏర్పాటు చేశారు. తాజాగా దీనిలో సభ్యులు, చైర్మన్ ను నియమించారు. దేశంలో న్యాయ పాలనను సమర్థవంతంగా నిర్వహించేలా చేసేందుకు సూచనలు ఇవ్వడమే లా కమిషన్ లక్ష్యం. కాగా, జస్టిస్ మహేశ్వరి 2023లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.
Next Story






