Kejriwal : బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ లో శాంతిభద్రతలకు ట్రబుల్ : కేజ్రీవాల్

by Y. Venkata Narasimha Reddy |

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై జరిగిన దాడి ఘటన(Attack)ను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) ప్రచారం(Campaigning)లో ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్(Kejriwal) బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ (BJP Double Engine Governments) నినాదంపై విమర్శల(Criticism)కు అస్త్రంగా మలిచారు.

Kejriwal : బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ లో శాంతిభద్రతలకు ట్రబుల్ : కేజ్రీవాల్
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై జరిగిన దాడి ఘటన(Attack)ను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) ప్రచారం(Campaigning)లో ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్(Kejriwal) బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ (BJP Double Engine Governments) నినాదంపై విమర్శల(Criticism)కు అస్త్రంగా మలిచారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తో ఢిల్లీ అభివృద్ధి చెందుతుందన్న ఆ పార్టీ ప్రచారాన్ని సైఫ్ అలీఖాన్ ఘటనతో కేజ్రీవాల్ తిప్పికొడుతున్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సైఫ్ అలీఖాన్ లాంటి సెలబ్రిటీలకు భద్రత కల్పించలేనప్పుడు, వారి నుంచి సామాన్యులు ఏం ఆశించగలరని ప్రశ్నించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటిదాడులు కొత్తేమీ కాదని.. నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి బయట కాల్పులు జరిగాయని, బీజేపీ కూటమి భాగస్వామిగా ఉన్న బాబా సిద్ధిక్‌ను హత్య చేయడం దేశంలో శాంతిభద్రతల పరిస్థితిని తెలియజేస్తోందన్నారు. దేశంలోని ప్రముఖులకు కూడా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ భద్రత కల్పించలేకపోతుందన్నారు. బీజేపీ పాలనలో దేశంలోని అంతర్గత శాంతిభద్రతలే కాదు..దేశ సరిహద్దులు కూడా సురక్షితంగా లేవని కేజ్రీవాల విమర్శించారు.

Next Story