- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆహ్వానం అందుకున్న లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగనున్న విషయం తెలిసిందే

దిశ వెబ్ డెస్క్: అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగనున్న విషయం విధితమే. ఈ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తొంది. బలరాముని ఆలయ ప్రారంభోత్సవంలో రావాల్సిందిగా పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఒక్క భారతదేశంలోనే కాక దేశ విదేశాలకు రామాలయ ట్రస్టు ఆహ్వానాలు పంపుతుంది.
ఈ నేపధ్యంలోనే దివంగత గాయని లతా మంగేష్కర్ కుటుంబసభ్యులకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. జనవరి 22న జరగబోయే రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని రామాలయ ట్రస్టు సభ్యులు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులను కోరారు. దీనికి సంబందించిన ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. దీనికి వారు తప్పక హజరు అవుతామని తెలిపినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. అయోధ్యలో లతా మంగేష్కర్ 93వ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ, సరయు నది ఒడ్డున్న ఒక కూడలి ఏర్పాటు చేసి, ఆ కూడలి వద్ద ఏర్పాటు చేసిన 40 అడుగుల భారీ వీణను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభింపజేసిన విషయం తెలిసిందే.






