2025లో ఆఖరి సూపర్ మూన్.. చూడటం అస్సలు మిస్ అవ్వకండి

by Naga Rani Yarlagadda |

2025లో ఆకాశంలో ఎక్కువగా సూపర్ మూన్స్ కనిపించాయి.

2025లో ఆఖరి సూపర్ మూన్.. చూడటం అస్సలు మిస్ అవ్వకండి
X

దిశ, వెబ్‌డెస్క్: 2025లో ఆకాశంలో ఎక్కువగా సూపర్ మూన్స్ కనిపించాయి. ఏడాదిలో మొత్తం 8 సూపర్ మూన్స్ కనిపించగా.. వరుసగా అక్టోబర్, నవంబర్ నెలల్లో సూపర్ మూన్స్ కనువిందు చేశాయి. ఇప్పుడు డిసెంబర్లోనూ మరో సూపర్ మూన్ కనిపించనుంది. సూపర్ మూన్ అంటే చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినపుడు చంద్రుడి ప్రతిబింబం కాస్త పెద్దదిగా కనిపిస్తుంది. 2025లో డిసెంబర్ 4న ఆఖరి సూపర్ మూన్ ఆకాశంలో కనువిందు చేయనుంది.

కానీ నాసా పరిశోధనల ఆధారంగా చూస్తే.. సూపర్ మూన్ అనేది అధికారికంగా ఖగోళ శాస్త్రానికి చెందిన పదం కాదు. పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి కనీసం 90 శాతం దూరంలో ఉన్నప్పుడు ఈ పదాన్ని వాడుతారు. దీన్నే కోల్డ్ మూన్, లాంగ్ నైట్ మూన్ అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో కనిపించిన హార్వెస్ట్ మూన్, నవంబర్ లో కనువిందు చేసిన బీవర్ మూన్ తర్వాత వస్తున్నదే లాంగ్ నైట్ మూన్.

కోల్డ్ మూన్ స్పెషల్ ఇదే..

ఈనెల 4న కనిపించనున్నది అసలైన సూపర్ మూన్. చంద్రుడు తన కక్ష్యలో భూమికి అతి దగ్గరగా పౌర్ణమి తిథిలో చేరినపుడు ఇది కనిపిస్తుంది. దీనిని జ్యోతిష్యం పరంగా వ్యక్తిగత అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. ముఖ్యంగా సాయంత్రం వేళ చంద్రోదయం సమయంలో చాలా పెద్దగా కనిపిస్తాడు. దీనిని మూన్ ఇల్యూషన్ అని చెప్తుంటారు. నిజంగా చందమామను చూసి ఆనందించాలనుకునేవారు ఓపెన్ ప్లేస్ ను ఎంచుకోవడం బెటర్.

Next Story