మరాఠీ మాట్లాడు లేదా వెళ్లిపో.. ముంబై లోకల్ ట్రైన్‌లో లాంగ్వేజ్ ఫైట్

by Ajay Maddhiboyina |

మహారాష్ట్రలో భాష వివాదం కొనసాగుతున్న వేళ మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ముంబై లోకల్ ట్రైన్‌లో మహిళల మధ్య సీటు కోసం జరిగిన గొడవ భాషా మరాఠీ వర్సెస్ హిందీ మారింది.

మరాఠీ మాట్లాడు లేదా వెళ్లిపో.. ముంబై లోకల్ ట్రైన్‌లో లాంగ్వేజ్ ఫైట్
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో భాష వివాదం కొనసాగుతున్న వేళ మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ముంబై లోకల్ ట్రైన్‌లో మహిళల మధ్య సీటు కోసం జరిగిన గొడవ భాషా మరాఠీ వర్సెస్ హిందీ మారింది. సెంట్రల్ లైన్ రైలులో మహిళల కోచ్‌లో ఆరేడుగురు మహిళలు మరాఠీ హిందీ అంటు గొడవపెట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా వీడియోలో ఓ మహిళ మీరు ముంబైలో నివసించాలి అంటే హిందీలో మాట్లాడండి లేదంటే వెళ్లిపోండి అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో మరికొందరు మహిళలు హిందీకి మద్దతిస్తూ మరాఠీ మహిళలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువురు బూతులు తిట్టుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో హిందీ, మరాఠీ అంటూ ఆందోళనలు జరుగుతుంటే తాజాగా జరిగిన ఘటన భాషా వివాదం ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి నిదర్శనంగా మారింది.

Next Story