- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక నుంచి పార్టీని తేజస్వీ ముందుకు నడిపిస్తారు: లాలూ ప్రకటన
ఇక నుంచి పార్టీని తేజస్వీ ముందుకు నడిపిస్తారు: లాలూ ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: ఆర్జేడీ భవితవ్యంపై ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనుంచి ఆర్జేడీని తేజస్వీ యాదవ్ ముందుకు నడిపిస్తారని అన్నారు. తేజస్వీ అడుగు జాడల్లో కార్యకర్తలు నడవాలని కోరారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కీలకంగా ఉన్న మహాఘట్‌బంధన్ కూటమి ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 145 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 సీట్లకే పరిమితమైంది. తేజస్వీ యాదవ్ నేతృత్వంలో ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లగా.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక ఈ ప్రభావం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు బయటికి వచ్చేలా చేశాయి. ఈ ఘోరపరాజయం నుంచి తేరుకోకముందే.. లాలూ కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఆయన కూతురు రోహిణి ఆచార్య.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కుటుంబంతో కూడా సంబంధాలు తెంచుకుంటున్నట్లు చేసిన ప్రకటన సంచలనంగా మారింది. దీంతో ఇవాళ మీడియా ముందుకు వచ్చిన లాలూ.. తేజస్వీకి కీలక బాధ్యతలు అప్పగించారు.






