- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనవరాలికి పేరు పెట్టిన మాజీ సీఎం
బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తండ్రి అయిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తండ్రి అయిన విషయం తెలిసిందే. తేజస్వి యాదవ్, రాజశ్రీ దంపతులకు గత సోమవారం పండంటి ఆడబిడ్డ పుట్టింది. అదే రోజు భార్య రబ్రీదేవితో కలిసి ఆసుపత్రికి వెళ్లిన తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ ఆ పాపను ఎత్తుకున్న ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. తాజాగా తన మనవరాలికి లాలూ ప్రసాద్ యాదవ్ ‘కాత్యాయని’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తేజస్వి యాదవ్ ప్రకటించారు.
మహిషాసురుడిని వధించిన శక్తిమాత పేరును తన కూతరుకు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. కాగా దుర్గా మాత తొమ్మిది రూపాల్లో ఆరో రూపమే కాత్యాయని. ఇక పాప పుట్టిన సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తేజస్వి యాదవ్ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు.
Next Story






