- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RJD అధ్యక్షుడిగా లాలూ
రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) 13వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) 13వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్నాలోని RJD కార్యాలయంలో తేజస్వీ యాదవ్, రబ్రీ దేవి, మీసా భారతి, సీనియర్ నాయకుల సమక్షంలో లాలూ నామినేషన్ దాఖలు చేశారు. వేరే అభ్యర్థులు పోటీ చేయకపోవడంతో లాలూ ఎన్నిక ఖాయమైంది. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. లాలూ నాయకత్వం పార్టీకి బలమని, రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Elections) తప్పకుండా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కాగా జూలై 5న "లాలూ సమ్మాన్ దివస్" జరుపుకోనున్నారు.
1997లో RJD స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీకి లాలూ నాయకత్వం వహిస్తుండగా.. బీహార్‌లో OBCలు, దళితులు, ముస్లింల మద్దతుతో RJD బలమైన ప్రతిపక్షంగా ఉంది. 78 ఏళ్ల లాలూ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ తన నాయకత్వం కొనసాగిస్తూ.. కుమారుడు తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీహార్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.






