- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేము భారత్ నుంచి పారిపోయిన అతిపెద్ద వ్యక్తులం.. లలిత్ మోడీ, విజయ్ మాల్యా వెటకారపు మాటలు
ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటూ లండన్ లో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారవేత్తలు లిలిత్ మోడీ, విజయ్ మాల్యాపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటూ లండన్ లో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారవేత్తలు లిలిత్ మోడీ, విజయ్ మాల్యాపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ మాల్యా 70వ పుట్టినరోజు సందర్భంగా లలిత్ మోడీ లండన్ లోని తన నివాసంలో ప్రీ బర్త్ డే పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా సహా పలువురు వ్యాపారవేత్తలను, మాల్యా స్నేహితులను ఆహ్వానించారు. ఇటీవల ఈ పార్టీ జరగ్గా తాజాగా లలిత్ మోడీ, మాల్యాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియోలో తాము ఇండియా నుండి పారిపోయిన అతిపెద్ద వ్యక్తులం అంటూ లలిత్ మోడీ, విజయ్ మాల్యా కామెంట్స్ చేశారు. అంతే కాకుండా లిలిత్ మోడీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో మరోసారి ఇండియాలో ఇంటర్నెట్ ను డౌన్ చేస్తామని పేర్కొన్నారు. మీ హృదయం అసూయతో నిండిపోయేలా ఒకటి ఇస్తున్నాం మీడియా ఫోక్స్ అంటూ పేర్కొన్నారు. మెడీ, మాల్యా చేసిన వ్యాఖ్యలు, మెడీ ఇన్ స్టా పోస్ట్ భారత్ పై, భారతీయ మీడియాపై సెటైర్ లా కనిపిస్తుంది. దీంతో నెటిజన్లు ఇద్దరిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేశ సంపదను దోచుకుని ఆర్థికనేరాలని పాల్పిడింది కాకుండా మళ్లీ దేశంపైనే సెటైర్లు వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






