- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాస్‌ఏంజిల్స్‌లో ఆరని కార్చిచ్చు.. మరింత వేగంతో వ్యాప్తి
అమెరికాలో రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చు మరింత వేగం పెంచింది.

దిశ, వెబ్ డెస్క్: దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజిల్స్‌లో జనవరి 7న చెలరేగిన మంటలు చెలరేగిన కార్చిచ్చు మరింత వేగం పెంచింది. బుధవారం మరో ప్రాంతంలో మంటలు చేలరేగి కేవలం రెండు గంటల్లో 10 రెట్లు అధికంగా వ్యాపించాయి. దీంతో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మంటలు లాస్ ఏంజిల్స్‌లో చాలా ప్రాంతాలను బూడిదగా మార్చాయి. మంటల్లో చిక్కుకుని 28 మంది మరణించారు. ఈ క్రమంలో అధికారులు 50 వేల మంది నివాసితులను ఖాళీ చేయించారు. ఆ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
కాస్టాయిక్ లేక్ సమీపంలో ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గంటల వ్యవధిలోనే చెట్లను, పొదలను బూడిద చేశాయి. తాజాగా కార్చిచ్చు మొదలైన ప్రాంతం.. ఇటీవల అగ్నికి ఆహుతైన ఈటన్, పాలిసేడ్స్‌కు కేవలం 64 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. పాలిసేడ్స్‌లో మంటలను 68శాతం అదుపు చేయగా.. ఈటన్‌లో ఫైర్‌ను 91 శాతం అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, దక్షిణ కాలిఫోర్నియా నుంచి గాలి బలంగా వీస్తుండటంతో మంటలు ఒక చోటు నుంచి మరో చోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి. అగ్నికీలల తీవ్రత దృష్ట్యా మంటలను అదుపు చేయడం అతి కష్టంగా మారిందని అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.






