- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా డిమాండ్ చేసిన సీఎం ఒమర్ అబ్దుల్లా
జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) రాష్ట్ర హోదా అంశాన్ని మరోసారి లేవనెత్తారు.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) రాష్ట్ర హోదా అంశాన్ని మరోసారి లేవనెత్తారు. శుక్రవారం చీనాబ్ వంతెన, కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని మోడీతో వేదిక పంచుకున్న ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌లోని అన్ని రైల్వే ప్రాజెక్టుల్లో ప్రధానితో అనుబంధం కలిగి ఉండటం తన అదృష్టమని అన్నారు. కాగా, మొదటిది అనంతనాగ్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం, రెండోది బనిహాల్ రైల్వే టన్నెల్ ప్రారంభోత్సవంలో తాను పాల్గొనడమని ఒమర్ అబ్దుల్లా గుర్తుచేశారు.
నేను డిమోట్ అయ్యా..
ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘2014లో కాట్రా రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇదే నలుగురు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అప్పటి రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పదోన్నతి పొందారు. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కేంద్రపాలిత ప్రాంతం సీఎంగా నన్ను తగ్గించారు. కానీ మనకు తెలియకముందే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తారు’ అని అన్నారు. దీంతో, మరోసారి జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న డిమాండ్‌ను మోడీ ముందు ఇలా ప్రస్తావించారు.






