విషాదం.. కుంకుమభాగ్య సీరియల్ నటి ఆత్మహత్య

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-15 09:35:30  IST  )

కుంకుమభాగ్య సీరియల్ నటి సంచిత ఉగాల్ ఆత్మహత్య చేసుకుంది.

విషాదం.. కుంకుమభాగ్య సీరియల్ నటి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: నార్త్ ప్రేక్షకులతో పాటు.. తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రముఖ సీరియల్ కుంకుమభాగ్య నటి సంచిత ఉగాల్ (22) ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఆమె ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. కుంకుమభాగ్య, వాగ్లే కీ దునియా వంటి సీరియల్స్ లో నటించి గుర్తింపు పొందిన ఆమెకు ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. కుంకుమ భాగ్య సీరియల్ లో ఆమె దియా టాండన్ పాత్రలో నటించింది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఛావా (Chhaava) సినిమాలో 'తారా రాణి' చిన్నప్పటి పాత్రను పోషించింది. ఇంత చిన్న వయసులోనే ఆమె సూసైడ్ చేసుకోవడం అభిమానులను, టెలివిజన్ పరిశ్రమను తీవ్రంగా కలచివేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలాసోపరా ఈస్ట్ లోని ఆచోలే విలేజ్ లో ఉన్న సాయి సంతోషి బిల్డింగ్ లోని తన నివాసంలో ఈ ఘటన జరిగింది. అసిస్టెంట్ పోలీస్ ఇన్ స్పెక్టర్ వినోద్ బాగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం సుమారు 7-7.30 గంటల మధ్య సంచిత తన బెడ్రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది. ఆపై గదిలోనే సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని మరణించింది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే వసాయి-విరార్ మున్సిపల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ జరిపారు. సంచిత తండ్రి మచ్చింద్ర ఉగాలే ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆచోలే పోలీసులు జూన్ 15న భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 194 కింద అపస్మారక మరణం (ADR)గా కేసు నమోదు చేశారు. సంచిత ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు వెల్లడించారు.

Next Story