- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maha Kumbh Hospital: మహాకుంభ్ సెంట్రల్ హాస్పిటల్ లో 12 ప్రసవాలు
ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ్ సెంట్రల్ ఆస్పత్రిలో ఇప్పటివరకు 12 మంది పిల్లలు జన్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో పిల్లలకు జన్మనివ్వడాన్నిక వారు తల్లిదండ్రులు అదృష్టంగా భావిస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ్ సెంట్రల్ ఆస్పత్రిలో ఇప్పటివరకు 12 మంది పిల్లలు జన్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో పిల్లలకు జన్మనివ్వడాన్నిక వారు తల్లిదండ్రులు అదృష్టంగా భావిస్తున్నారు. త్రివేణి సంగమంతో తమ బంధాన్ని ముద్రించే పేర్లను ఎఁచుకుంటున్నారు. ఆదివారం రాత్రి సెంట్రల్ ఆస్పత్రిలో మగ శిశువు జన్మించినట్లు ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మనోజ్ కౌశిక్ తెలిపారు. అయితే, ఈ 12 మందివి సాధారణ ప్రసవాలే అని చెప్పుకొచ్చారు. ఫుల్పూర్‌లోని సారాయ్ చండికి చెందిన నేహా సింగ్ ఆదివారం నొప్పులతో ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. అయితే, బాలుడికి కుంభ్ అని పేరు పెట్టాలని పట్టుబట్టినట్లు చెప్పారు. కానీ, డిసెంబర్ 29న అదే హాస్పిటల్ లో పుట్టిన మరో శిశువుకు ఆ పేరు పెట్టినట్లు తెలిపారు. అందుకే, ఆస్పత్రి సిబ్బంది ఆ చిన్నారికి కుంభ్- 2 అనే పేరు పెట్టాలని సూచించారు. "ఆస్పత్రి సిబ్బంది నా కొడుకుకు కుంభ్ అని పేరు పెట్టకపోయినా, ఈ మహా కుంభ్ లో జన్మించినందున నేను అతనికి కుంభ్ అని పేరు పెడతాను" అని బాలుడి తండ్రి దీపక్ ఆనందంతో అన్నాడు.
ఆధ్యాత్మిక పేర్లు..
మహా కుంభ్ సెంట్రల్ హాస్పిటల్ లో పుట్టిన చిన్నారులకు ఆధ్యాత్మిక పేర్లను పెట్టినట్లు అధికారులు చెప్పారు. భోలేనాథ్, బజరంగీ, నంది, గంగ, జమున అనే పేర్లు పెట్టినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 3న వసంత పంచమిలో ఇద్దరు పిల్లలు పుట్టారు. అబ్బాయికి బసంత్, అని చిన్నారికి బసంతి అని పేరు పెట్టినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గర్భిణీలకు హాస్పిటల్ లో డెలివరీలు జరిగినట్లు పేర్కొన్నాయి. ఇకపోతే, సెక్టార్ 2లో ఉన్న సెంట్రల్ హాస్పిటల్.. జనవరి 13న అధికారికంగా ప్రారంభమైంది. మహాకుంభమేళా ముగిసే ఫిబ్రవరి 26 వరకు ఆ ఆస్పత్రిలో సేవలు అందించనున్నారు. మహా కుంభమేళాలో భక్తులకు సేవలందించడానికి ఏర్పాటు చేసిన 13 హాస్పిటల్స్ లో మహాకుంభ్ సెంట్రల్ ఆస్పత్రి ఒకటి. అయితే, యాత్రికులు డిసెంబర్ 2024 నుంచే అక్కడికి రావడం ప్రారంభించారు. కాగా.. డిసెంబర్ 29న కౌశాంబికి చెందిన సోనమ్.. కుంభ్ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ హాస్పిటల్ లో అదే తొలి ప్రసవం అని ఉత్తరప్రదేశ్ ఆరోగ్య మంత్రి బ్రజేష్ పాఠక్ చెప్పుకొచ్చారు.






