- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > Junior Doctors: ముగ్గురు జూనియర్ డాక్టర్లకు సమన్లు.. జూనియర్ వైద్యురాలి హత్య కేసులో కీలక పరిణామం
Junior Doctors: ముగ్గురు జూనియర్ డాక్టర్లకు సమన్లు.. జూనియర్ వైద్యురాలి హత్య కేసులో కీలక పరిణామం
by Hajipasha |
దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు చెందిన జూనియర్ వైద్యురాలి హత్య, అత్యాచారం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

X
దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు చెందిన జూనియర్ వైద్యురాలి హత్య, అత్యాచారం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ముగ్గురు జూనియర్ డాక్టర్లు, ఒక హౌజ్ స్టాఫ్‌కు కోల్‌కతా పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. జూనియర్ వైద్యురాలితో పాటు ఈ నలుగురు కూడా గత గురువారం (ఆగస్టు 8న) రాత్రి హాస్పిటల్‌లో డ్యూటీ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఆగస్టు 9న ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లో జూనియర్ వైద్యురాలు విగత జీవిగా కనిపించింది. మరోవైపు ఈ కేసులో నిందితులను సాధ్యమైనంత త్వరగా అరెస్టు చేయాలని పోలీసులను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. ఆదివారంకల్లా ఈ కేసును పోలీసులు పరిష్కరించలేకపోతే, దీన్ని సీబీఐకి అప్పగిస్తామి దీదీ స్పష్టం చేశారు.
Next Story






