రాత్రికి రాత్రే కోహ్లీ, రొనాల్డో, అలియా భట్‍ వంటి సెలబ్రెటీలకు షాక్.. లక్షలాది ఫాలోవర్స్ మాయం

by Prasad Jukanti |

నకిలీ ఖాతాల ఏరివేతకు మెటా భారీ ఆపరేషన్ చేపట్టింది. AI టెక్నాలజీతో కోట్లాది బాట్ అకౌంట్లను తొలగించడంతో సెలబ్రిటీల ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గింది.

రాత్రికి రాత్రే కోహ్లీ, రొనాల్డో, అలియా భట్‍ వంటి సెలబ్రెటీలకు షాక్.. లక్షలాది ఫాలోవర్స్ మాయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' తన ఖాతాదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. తన ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ ఖాతాలను ఏరివేసేందుకు భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ దెబ్బకు ఉన్న పలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సాధారణ అకౌంట్ హోల్డర్ల నుంచి నుంచి సెలబ్రేటీల వరకు భారీగా ఫాలోవర్స్ ను లాస్ అయ్యారు. అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రిస్టియానో రొనాల్డో, బ్లాక్ పింక్, టేలర్ స్విఫ్ట్, విరాట్ కోహ్లీ, లియోనెల్ మెస్సీ, అలియా భట్ లాంటి దిగ్గజాల అకౌంట్ల నుంచి లక్షల సంఖ్యలో ఫాలోవర్లు మాయమైపోయారు. మొదట ఇదంతా ఏదో టెక్నికల్ సమస్య అని, ఇన్‌స్టాగ్రామ్ సర్వర్ డౌన్ అయిందని అంతా భావించారు. కానీ డౌన్ ఫాల్ వెనుక ఇన్‌స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ ‘మెటా’ బాస్ మార్క్ జుకర్‌బర్గ్. ప్లాట్‌ఫారమ్‌ను క్లీన్ చేయడానికి మెటా వేసిన భారీ స్కెచ్ అని తెలిసి షాక్ అయ్యారు.

AI టెక్నాలజీతో ఏరివేత:

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడరేషన్ సిస్టమ్స్ సాయంతో మెటా ఈ ప్రక్షాళన చేపట్టింది. ప్లాట్‌ఫారమ్ విశ్వసనీయతను కాపాడటం, నకిలీ ప్రచారాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు సంస్థ తెలిపింది. నకిలీ నిశ్చితార్థం (Fake engagement patterns), బాట్‌ల ద్వారా జరిగే కార్యకలాపాలను గుర్తించేందుకు సరికొత్త మోడరేషన్ వ్యవస్థను మెటా ప్రవేశపెట్టింది. ఈ చర్యతో ముఖ్యంగా కే-పాప్ (K-pop), ఫుట్‌బాల్ స్టార్ల ఖాతాలను లక్ష్యంగా చేసుకుని క్రిప్టో స్కామ్‌లు మరియు ప్రకటనల కోసం బాట్ ఫామ్స్ (Bot farms) సృష్టించిన నకిలీ ఖాతాలను ప్రధానంగా తొలగించారు. వంటి ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రిటీల ఖాతాల నుండి కోట్లాది ఫేక్ ఫాలోవర్లను మెటా తొలగించింది. 2025లో మెటా చేపట్టిన విస్తృత ప్రయత్నాల్లో భాగంగా.. స్కామ్ కేంద్రాలకు లింక్ అయి ఉన్న 1.09 కోట్ల ఖాతాలను, అలాగే 15.9 కోట్ల స్కామ్ అడ్వర్టైజ్మెంట్లను తొలగించింది. విశేషమేమిటంటే, వినియోగదారులు ఫిర్యాదు చేయకముందే సుమారు 92 శాతం స్కామ్ ప్రకటనలను మెటా తనంతట తానుగా గుర్తించి తొలగించగలిగింది.

క్రిప్టో వ్యూహంలో భాగంగానే!

మెటా తన క్రిప్టో ప్రాజెక్టులను విస్తరిస్తున్న తరుణంలో ఈ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొలంబియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లోని క్రియేటర్లకు 'USDC' స్టేబుల్‌కాయిన్ ద్వారా చెల్లింపులు చేసే ప్రక్రియను మెటా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, ప్లాట్‌ఫారమ్‌ను మరింత పారదర్శకంగా మార్చడం ద్వారా నియంత్రిత పేమెంట్ భాగస్వాములను (Regulated payment partners) ఆకర్షించాలని మరియు తన బ్లాక్‌చైన్ వ్యూహాన్ని బలోపేతం చేయాలని మెటా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్షాళనతో సెలబ్రిటీల ఫాలోవర్ల సంఖ్య తగ్గినప్పటికీ, ప్లాట్‌ఫారమ్‌లో అసలైన యూజర్ల భాగస్వామ్యం పెరుగుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Next Story