రికార్డులు మిస్ అయిన కోహ్లీ

by Ajay Maddhiboyina |

కోహ్లీ ఫెయిల్ అవడమే కాకుండా పలు రికార్డులు కూడా మిస్ అవడం అభిమానులను నిరాశపరిచింది.

రికార్డులు మిస్ అయిన కోహ్లీ
X

దిశ, స్పోర్ట్స్: చాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజీలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై కోహ్లీ 9 బంతుల్లో 5 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ మ్యాచ్ భారత్ ఓడిపోయింది. ఇక న్యూజీలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో మరో సారి విఫలం అయ్యాడు. అంతే కాకుండా కోహ్లీ పలు రికార్డులు కూడా మిస్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో 47 పరుగులు చేసి ఉంటే ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించే వాడు. ఇక అంతే కాకుండా చాంపియన్స్ ట్రోఫీ మొత్తంగా చూస్తే క్రిస్ గేల్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. మరో 56 పరుగులు చేసి ఉంటే క్రిస్ గేల్‌ను కోహ్లీ అధిగమించే వాడు. దీంతో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ బ్యాటర్లు సచిన్, సంగక్కర తర్వాత కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ మరో 54 పరుగులు చేసి ఉంటే సంగక్కరను వెనక్కు నెట్టి రెండో స్థానంలోకి వచ్చేవాడు. ఇక న్యూజీలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడానికి కోహ్లీకి కేవలం 11 పరుగులు అవసరం. ఈ రికార్డు కూడా మిస్ అయ్యాడు. కోహ్లీ ఫెయిల్ అవడమే కాకుండా పలు రికార్డులు కూడా మిస్ అవడం అభిమానులను నిరాశపరిచింది.

Next Story