- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kodanad Case : పళనిస్వామి, శశికళకు షాక్.. జయలలిత ఎస్టేట్‌లో దోపిడీ కేసులో సంచలన ఆదేశాలు
దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్(Kodanad Case)లో 2017లో జరిగిన హత్య, దోపిడీ కేసులో మద్రాస్ హైకోర్టు(Madras HC) కీలక ఆదేశాలు జారీ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్(Kodanad Case)లో 2017లో జరిగిన హత్య, దోపిడీ కేసులో మద్రాస్ హైకోర్టు(Madras HC) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రతిపక్ష అన్నా డీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి(Palaniswami), శశికళ(Sasikala) తదితరులను విచారించేందుకు సీబీసీఐడీ పోలీసులకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. 2017లో కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన దోపిడీ, సెక్యూరిటీ గార్డ్ ఓం బహదూర్ హత్య కేసుపై తొలుత పోలీసులు విచారణ నిర్వహించారు. అయితే కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతీ జరగలేదు.
రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వచ్చాక ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేయగా, దాదాపు 100 మందిని విచారించారు. పళనిస్వామి, శశికళలకు విచారణ నుంచి మినహాయింపు కల్పిస్తూ ఊటిలోని జిల్లా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీసీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వారిని విచారించేందుకు పర్మిషన్‌ను మంజూరు చేసింది. ఎస్టేట్‌లో కనిపించకుండా పోయిన కొన్ని విలువైన వస్తువుల గురించి శశికళ, ఇళవరసిని ప్రశ్నించాలని ఆదేశించింది.






