- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిష్టవర్ క్లౌడ్ బరస్ట్.. పంద్రాగస్టు వేడుకలు రద్దు
జమ్ముకాశ్మీర్లో(Jammu Kashmir) నేడు క్లౌడ్ బరస్ట్(Cloud burst) సంభవించి భారీ ఆకస్మిక వరదలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్లో(Jammu Kashmir) నేడు క్లౌడ్ బరస్ట్(Cloud burst) సంభవించి భారీ ఆకస్మిక వరదలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. చోసిటీలోని కిష్టవర్లో సంభవించిన ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ లో ఇప్పటి వరకు 38 మంది మృతి చెందగా.. 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 220 మంది గల్లంతయ్యారని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జమ్ముకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు జరగాల్సిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. శ్రీనగర్లోని బక్షి స్టేడియంలో జరగనున్న ఈ వేడుకల్లో కొద్దిపాటి అధికారిక కార్యక్రమాలు తప్ప మిగతా అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేసారు.
అలాగే రేపు సాయంత్రం జరగాల్సిన 'ఎట్ హోం' తేనీటి విందు కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. కిష్టవర్ ఘటనలో మృతుల సంఖ్యా భారీగా పెరిగే అవకాశం ఉందని, భారీగా కొట్టుకు వచ్చిన బురద, రాళ్ల కింద అనేకమంది చిక్కుకుపోయి ఉండవచ్చని అన్నారు. ఆర్మీ, నేవి, NDRF, SDRF బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.






