ఒకే దేశం, ఒకే ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కిషన్ రెడ్డి

by Ajay Maddhiboyina |

భారత దేశానికి స్వాతంత్రం సాధించి 76 సంవత్సరాలు గడిచినా ఇంకా బ్రిటిష్ వారి విధానాలే అవలంబించడం వల్ల అభివృద్దిలో ఆశించిన స్దాయిలో ముందుకు పోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు.

ఒకే దేశం, ఒకే ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత దేశానికి స్వాతంత్రం సాధించి 76 సంవత్సరాలు గడిచినా ఇంకా బ్రిటిష్ వారి విధానాలే అవలంబించడం వల్ల అభివృద్దిలో ఆశించిన స్దాయిలో ముందుకు పోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు.ఆదివారం సోమాజిగూడలో జరిగిన ఒకే దేశం - ఒకే ఎన్నికలు దేశవ్యాప్త అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ ప్రధాని మోడీ ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి వర్తమాన రాజకీయ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్ని మార్చుకోవాలని సూచినలు చేసినట్లు చెప్పారు. దానికి అనుగుణంగా కొన్ని మార్చుకున్నాం కానీ దురదృష్టం ఏంటంటే మార్చే క్రమంలో వాటికి అడ్డంపడే ప్రయత్నం జరుగుతుందన్నారు. దాంట్లో భాగంగానే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి ప్రజల్లో చైతన్యం నింపాలి ప్రజల మధ్యకు వెళ్లి ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నం చేయాలని ప్రధాని చెబుతుంటారని వెల్లడించారు. రాజకీయ పార్టీల మీద మేధావుల మీద విశ్లేషకుల మీద ఒత్తిడి తీసుకురావాలి ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారాలని సూచించారు.

ఎప్పడు ఎన్నికలు జరిగితే సమయం వృథా అని దేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా దేశమంతా చర్చ జరుగుతూ ఉంటుందన్నారు. దీంతో ఎన్నో పని గంటలు వృధా అవుతున్నాయని ఒకేసారి ఎన్నికలు జరుగుతే ఇలాంటి పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. దేశంలో మార్పు రావాలి అది మోడీ నాయకత్వంలోనే మార్పు వస్తుందన్నారు. జీఎస్టీ, 370 ఆర్టికల్ విషయంలో ఆయన పట్టుదలతోనే అది సాధ్యమైందని త్రిబుల్ తతాక్ విషయంలో కూడా అదే నిజమైందన్నారు. ఓట్ల కోసం త్రిబుల్ తలక్ కొనసాగించారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా అది కంటిన్యూ చేశారని, సీఏఏ, న్యూ క్రిమినల్ యాక్ట్ తీసుకోచ్చింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో ఎన్నో ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ గడ్డమీదికి వెళ్లి వారిని తుద ముట్టించే ప్రయత్నాలు మోడీ సర్కార్​ చేసిందన్నారు. పహాల్గం దాడి తర్వాత క్యాండిల్ లైట్లతో ఎర్ర గులాబీలతో సంతాపం ప్రకటించలేదని వారి స్థావరాల్ని పేల్చేశామన్నారు. దేశంలో సంస్కరణాలు తీసుకురావడం దేశం కోసం ఏదైనా చేయాలంటే అది మోడీ ప్రభుత్వానికి సాధ్యమన్నారు.

జాతీయ రహదారుల నిర్మాణం రైల్వేస్టేషన్ పునర్నిర్మాణం లాంటి అనేక చర్యలు చేపట్టిందని, నేడు దేశం పరిస్థితులు, అభివృద్ధి దృష్ట్యా వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాల్సిందేనన్నారు. ఎక్కడో ఒకచోట ఎప్పుడు ఎలక్షన్స్ ఉండడంతతో సిబ్బందికి ప్రభుత్వానికి ఇది అభివృద్ధికి అడ్డంకి గా మారిందనే విషయం ప్రజలు ఆలోచించాలని కోరారు. దేశ అభివృద్ధి కోసం భవిష్యత్తు తరాల నిర్మాణం సంస్కరణలు తీసుకురావాల్సిందే తీసుకురావాల్సిన అవసరం ఉందని బీజేపీ ప్రభుత్వానికి మద్దతునివ్వాలన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల గురించి ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా యావత్ ప్రపంచం మన దేశం వైపు చూస్తుందన్నారు. భవిష్య తరాలకు మంచి దేశాన్ని అందించాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవసరం దీనికి అందరూ ప్రజలు సహకరించాలి.

Next Story