- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరా అలా చేయలేదు.. రాహుల్‌పై కిరణ్ రిజిజు విమర్శలు
by Phanindra |
కొలంబియా వెళ్లి భారత్‌పై విమర్శలు చేసిన రాహుల్‌పై కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందిరా గాంధీ కూడా అలా చేయలేదన్నారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ప్రసంగంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. విదేశీ గడ్డపై నుంచి భారత్‌ను కించపరిచారంటూ రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీని గుర్తుచేశారు. ఆమె ఎప్పుడూ విదేశాల్లో భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. విదేశాలకు వెళ్లి భారత్‌కు వ్యతిరేకంగా మాట్టాడుతున్న తొలి వ్యక్తి రాహులే అని కిరణ్ విమర్శించారు. ‘విదేశాల్లో భారత్‌కు వ్యతిరేకంగా తను ఎప్పుడూ మాట్లాడనని ఇందిరా గాంధీ అనేవారు. అలా చేస్తున్న తొలి వ్యక్తి రాహుల్ గాంధీనే’ అని రిజిజు అన్నారు. కొలంబియాలో యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్.. భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, ఇది దేశంలోనే అతిపెద్ద సవాలని చెప్పిన సంగతి తెలిసిందే.
Next Story






