ఉత్తర కొరియా వారసురాలిగా 13 ఏళ్ల అమ్మాయి..!

by velandi.Saikiran |

కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు ఏను ఉత్తర కొరియా తదుపరి నాయకురాలిగా ఎన్నుకున్నారు.

ఉత్తర కొరియా వారసురాలిగా  13 ఏళ్ల అమ్మాయి..!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఉత్తర కొరియా ఈ పేరు వినగానే అందరికీ కిమ్ జోంగ్ ఉన్ ( Kim Jong Un) మాత్రమే గుర్తుకు వస్తారు. ఉత్తర కొరియాలో ఆయన తీసుకునే నిర్ణయాలు... ఇప్పటికీ హార్ట్ టాపికే. ముఖ్యంగా కరోనా సమయంలో పాజిటివ్ వచ్చినవాళ్లను వెంటనే లేపేయాలని ఆదేశాలు ఇచ్చిన దుర్మార్గుడు కూడా ఇతడే. అయితే అలాంటి ఉత్తర కొరియా ( North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన వారసురాలిగా ఆయన కూతురు కిమ్ జు ఏను ( Kim Ju Ae ) ఫైనల్ చేసినట్లు సమాచారం అందుతోంది.

ఈ విషయాన్ని దక్షిణ కొరియా కూడా ధ్రువీకరించినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. మరో రెండు రోజుల్లో ఆయన ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ తన కూతురు కిమ్ జు ఏను ( 13-year-old daughter Kim Ju Ae ) అధ్యక్షురాలిగా నిర్ణయించారని దక్షిణ కొరియాకు సంబంధించిన నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ స్పష్టం చేయడం ఇప్పుడు అనుమానాలకు తావు ఇస్తోంది. అటు ఇదే అంశాన్ని దక్షిణ కొరియా కూడా చట్టసభల నేతలకు తెలిపినట్లు కూడా ఈ ఇంటలిజెంట్ సర్వీస్ లీక్ చేసిందట. దీంతో ఉత్తర కొరియాకు కొత్త అధ్యక్షురాలు రాబోతున్నట్లు చర్చ జరుగుతోంది.

13 ఏళ్ల కూతురు కిమ్ జు ఏకు అధ్యక్ష బాధ్యతలు ?

దక్షిణ కొరియాకు సంబంధించిన నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తన 13 సంవత్సరాల కూతురు కిమ్ జే యేను తన తర్వాతి వారసురాలిగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ మధ్యకాలంలో తన కూతురు కిమ్ జు ఏకు అనేక విద్యలు కూడా నేర్పినట్లు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఉత్తర కొరియాకు సంబంధించిన క్షిపణీ పరీక్షలు, సైనిక దాడులకు సంబంధించిన విషయాల గురించి కూడా తన కూతురికి నేర్పించారట.

ఇందులో భాగంగానే విదేశీ ప్రతినిధులతో జరిగే సమావేశాల్లో కూడా తన పక్కనే కూతురిని కూర్చోబెట్టుకొని చర్చలు చేస్తున్నారట ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో కూడా చైనాలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కూతురితోనే పర్యటించారు. ఆ సందర్భంగా తన కూతురే దగ్గరుండి చైనా పర్యటనకు సంబంధించిన పనులను చూసుకున్నారట. ఈ తరుణంలోనే ఉత్తర కొరియా అధ్యక్షురాలిగా తొలి మహిళ నాయకురాలుగా కిమ్ జోంగ్ ఉన్ కూతురు కిమ్ జు ఏ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని దక్షిణ కొరియాకు సంబంధించిన ఇంటిలిజెంట్ సర్వీస్ వెల్లడించింది.

Next Story