- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టైలర్‌గా మారిన జీవితఖైదు కిల్లర్.. 26 ఏళ్ల తర్వాత అరెస్ట్
ఓ బాలుడిని చంపిన కేసులో జీవితఖైదు శిక్ష పడిన కిల్లర్.. పోలీసుల నుంచి తప్పించుకుని పాతికేళ్లకు పైగా మారువేషంలో తిరుగుతున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఓ బాలుడిని చంపిన కేసులో జీవితఖైదు శిక్ష పడిన కిల్లర్.. పోలీసుల నుంచి తప్పించుకుని పాతికేళ్లకు పైగా మారువేషంలో తిరుగుతున్నాడు. ఎట్టకేలకు అతడిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 1993లో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ కు చెందిన రాజ్ కిశోర్ అలియాస్ బడే లల్లా (55), 1993లో ఢిల్లీలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీ యజమాని కొడుకుని అపహరించాడు. బాలుడిని తిరిగి అప్పగించేందుకు రూ.30 వేలు డిమాండ్ చేయగా.. తల్లిదండ్రులు ఆ డబ్బును కూడా చెల్లించారు. అయినప్పటికీ ఆ నరహంతకుడు కనికరించలేదు. అభం శుభం తెలియని బాలుడిని గొంతునులిమి హత్య చేసి, కళ్యాణ్ పురి సమీపంలోని మురుగు కాల్వలో మృతదేహాన్ని పడేసి పరారయ్యాడు.
ఈ కేసులో పోలీసులు నిందితుడైన బడేలల్లాపై ఐపీసీ సెక్షన్ 302, 364A కింద అతడిని అరెస్ట్ చేశారు. విచారణ పూర్తయ్యాక 1996లో ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. 1999లో ఆరువారాల పాటు కండీషనల్ బెయిల్ పై బయటకు వచ్చిన అతడు.. తిరిగి జైలుకు వెళ్లకుండా పరారయ్యాడు. పోలీసులకు చిక్కకుండా మారు వేషాల్లో పలు ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. 26 ఏళ్లుగా దొరక్కుండా తిరుగుతున్న లల్లాను పట్టుకోవడాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంది ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు చెందిన యాంటీ రాబరీ అండ్ స్నాచింగ్ సెల్ టీమ్.
రెండు నెలల స్పెషల్ ఆపరేషన్ తర్వాత.. హెడ్ కానిస్టేబుల్ మింటూ యాదవ్ కు అందిన పక్కా సమాచారంతో నిందితుడిపై నిఘా పెట్టింది. శనివారం (ఆగస్టు 2) ఘజియాబాద్ లోని ఖోడా కాలనీలో అతడిని అరెస్ట్ చేశారు. ఈ 26 ఏళ్లలో బిహార్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో టైలర్ గా పనిచేస్తూ జీవనం సాగించినట్లు లల్లూ తెలిపారు. కరోనా సమయంలో మాత్రం తన సొంతూరైన కాన్పూర్లోనే టైలరింగ్ చేసినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు.






