- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
covid -19: ఆ కోవిడ్ పేషంట్ ను చంపేయ్.. వెలుగులోకి కరోనా సమయంలో డాక్టర్ దారుణం
కరోనా సమయంలో మహిళా పెషంట్ ను చంపేయాలని ఓ డాక్టర్ మరో డాక్టర్ కు చేసిన సూచన వెలుగు చూసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మానవాళి చరిత్రలో కరోనా వైరస్ సృష్టించిన ప్రళయం ఓ చీకటి అధ్యాయం. వైద్యరంగంలో ఎంతో అడ్వాన్స్ గా మారామని జబ్బలు చర్చుకుంటున్న మానవజాతికి ఈ మహమ్మారి అంతులేని వ్యథలు మిగిల్చింది. కళ్లముందే అయిన వాళ్లు పిట్టల్లా రాలిపోతుంటే ఏం చేయలేని నిశ్చేష్టులుగా మానవజాతిని మార్చేసిందీ వైరస్. 2019లో జూలు విదిల్చిన కరోనా మహామ్మారి పీడకలలు ఇప్పటికే అనేక మందికి కుటుంబాలను వెంటాడుతూనే ఉన్నాయి. ఒక్కసారిగా విలయతాండవం చేసిన ఈ రాకాసి వైరస్ దెబ్బకు ఆసుపత్రుల్లో బెడ్లు దొరకక కొందరు.. బెడ్లు దొరికినా సరిపడ ఆక్సిజన్ లభించక మరికొందరు ప్రాణాలు వదిలేసిన సంఘటను మనందరి కళ్లముందు కదులాడుతూనే ఉన్నాయి. తాజాగా 2021 కోవిడ్ విజృంభించిన సమయం నాటి ఓ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రాణాలు కాపాడాల్సిన ఓ వైద్యుడే కోవిడ్ పేషంట్ ను చంపెయాలని మరో వైద్యుడికి సూచన చేసిన ఆడియో క్లిప్ వైరల్ గా మారింది.
జస్ట్ కిల్ ద విమెన్:
కోవిడ్ (COVID-19) సోకడంతో 2021 లో అజిమోద్దీన్ గౌసోద్దీన్ తన భార్య కౌసర్ ఫాతిమాను మహారాష్ట్రలోని (Maharashtra) లాతూర్ లోని (Latur) ఉద్గిర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పాతిమ పది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో బెడ్లు లేకపోవడంతో ఆమెను చంపెయాలని డాక్టర్ శశికాంత్ డాంగేకు ఫోన్ లో మరో డాక్టర్ శశికాంత్ దేశ్ పాండే సూచించారు. ఇద్దరి సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ లీక్ అయింది. తాజాగా ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో వైద్యుడు దేశ్ పాండేపై ఆ దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కులం, మతం వివక్షతో ఈ డాక్టర్ ఈ వ్యాఖ్యలు చేశారని గౌసోద్దీన్ ఎఫ్ఐఆర్ లో ఆరోపించారు. తాను ఆ వ్యాఖ్యలను అప్పుడే ఫోన్ స్పీకర్ లో నుంచి విన్నానని కానీ నా భార్య ఇంకా చికిత్స పొందుతున్నందున అతను అప్పుడు మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వ్యాఖ్యలు మళ్లీ వినడం వల్ల తాను మానసిక క్షోభకు గురయ్యానని వైద్యుల వ్యాఖ్యలు తన మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు డాక్టర్లక నోటీసులు జారీ చేశారు.






