'న్యాయమే గెలిచింది'.. నేషనల్‌ హెరాల్డ్‌ కేసుపై ఖర్గే కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌కు ఊర‌ట ల‌భించ‌డంపై కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు ఖ‌ర్గే స్పందించారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసును రాజ‌కీయ దురుద్దేశంతోనే వేశార‌ని అన్నారు.

న్యాయమే గెలిచింది.. నేషనల్‌ హెరాల్డ్‌ కేసుపై ఖర్గే కీలక వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌కు ఊర‌ట ల‌భించ‌డంపై కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు ఖ‌ర్గే స్పందించారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసును రాజ‌కీయ దురుద్దేశంతోనే వేశార‌ని అన్నారు. నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక ఇప్ప‌టిది కాద‌ని 1938లో దేశ‌స్వాతంత్య్రం కోసం పుట్టింద‌ని చెప్పారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులే ఈ ప‌త్రిక‌ను ప్రారంభించార‌ని అన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ ప్ర‌భుత్వం సీబీఐ, ఈడీలల‌ను వాడుకుని కాంగ్రెస్ నేత‌ల‌పై వేధింపుల‌కు గురి చేస్తోంద‌న్నారు. గాంధీ కుటుంబాన్ని వేధించేందుకు ఈ కేసు పెట్టార‌ని చెప్పారు.

ఈ కేసులో ఏమీ లేదని ఎఫ్ఐఆర్ కూడా లేద‌న్నారు. ఎవ‌రో ప్రైవేటు వ్య‌క్తులు ఫిర్యాదు చేస్తార‌ని త‌ర‌వాత విచార‌ణ పేరుతో వేధిస్తార‌ని చెప్పారు. కేసులో ద‌మ్ము లేక‌పోయినా ఏదో ఉన్న‌ట్టు చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈడీ, మ‌నీలాండ‌రింగ్ కేసుల‌తో వేధించి కాంగ్రెస్ ఎంపీల‌ను, రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను బీజేపీ త‌మ పార్టీలో చేర్చుకుంద‌న్నారు. కేసులో ఊర‌ట ల‌భించ‌డంతో స‌త్య‌మే గెలిచింద‌ని స‌త్య‌మేవ‌జ‌య‌తే అనేదే త‌మ నినాదం అన్నారు. న్యాయ‌మే ఎప్పుడూ గెలుస్తుంద‌ని కోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని చెప్పారు.

Next Story