- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Kharge: పాపాలను కప్పిపుచ్చుకోడానికే బీజేపీ ప్రయత్నం.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ హెరాల్డ్ (National Herald) మనీలాండరింగ్ కేసు లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీపై కాంగ్రెస్ ఛీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge) తీవ్ర విమర్శలు గుప్పించారు. తన పాపాలను కప్పిపుచ్చుకునేందుకే కాషాయ పార్టీ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుందని ఫైర్ అయ్యారు. ఈ చర్యలకు కాంగ్రెస్ భయపడబోదని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టడానికి తన గొంతులు మరింతగా పెంచుతూనే ఉంటుందని నొక్కి చెప్పారు. బీజేపీ తాను చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం ఆర్థిక దుర్వినియోగానికి సైతం పాల్పడుతోందని విమర్శించారు.
వాణిజ్య లోటు మూడేళ్ల గరిష్ట స్థాయిలో ఉందని, సుంకాలు, వాణిజ్య యుద్ధంపై స్పష్టత లేదన్నారు. ఇటీవల ఓ ఆర్బీఐ సర్వేపై ఖర్గే స్పందిస్తూ.. 90 శాతం మంది వినియోగదారులు వస్తువుల ధరలు పెరిగాయని వెల్లడించారని గుర్తు చేశారు. అంతేగాక 80 శాతం కంటే ఎక్కువ మంది తమ ఆదాయాలు పెరగకపోయినా ఖర్చులు మాత్రం పెరిగాయని చెప్పారన్నారు. ప్రభుత్వం ఇంధన దోపిడీకి పాల్పడుతోందని 2024 డిసెంబర్ వరకు పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel), ఇంధనంపై పన్నులు, సుంకాల రూపంలో రూ. 39 లక్షల కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినందుకు బీజేపీని ప్రజలు క్షమించబోరని తెలిపారు.