మీ దేశం సంగతి చూసుకోండి : ట్రంప్ కు ఖమేనీ వార్నింగ్

by Muthe.Rajitha |

ఇతర దేశాలకు నీతులు చెప్పడానికి ముందు సొంత దేశ సమస్యలపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు సూచించారు.

మీ దేశం సంగతి చూసుకోండి : ట్రంప్ కు ఖమేనీ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లపై ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రంగా మండిపడ్డారు. గతంలో అమెరికా మద్దతుతో ఇరాన్‌ను పాలించిన ‘షా’ వారసుడు యువరాజు రెజా పహ్లావి ఇచ్చిన పిలుపుతో ఇరాన్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. గురువారం మొదలైన ఈ ఆందోళనలు శుక్రవారం ఉదయం వరకు కొనసాగాయి. ప్రభుత్వం ఇంటర్నెట్‌, ఫోన్ సేవలను నిలిపేసినప్పటికీ చాలా మంది ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. ఈ పరిస్థితుల్లో స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర ఖమేనీ.. ఆందోళనకారులను ఉద్దేశిస్తూ వీడియోను విడుదల చేసారు.

అందులో విదేశీ చేతుల్లో కీలు బొమ్మల్లా మారిన వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదని హెచ్చరించారు. ఇతర దేశాలకు నీతులు చెప్పడానికి ముందు సొంత దేశ సమస్యలపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు సూచించారు. ట్రంప్ ను సంతోషపెట్టేందుకు తమ దేశ వీధులను నాశనం చేయడం సరికాదని ఆందోళనకారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

Next Story