- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా దాడి చేస్తే దీటైన జావాబిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ (Ayathullah ali khameni) వార్నింగ్ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా దాడి చేస్తే దీటైన జావాబిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ (Ayathullah ali khameni) వార్నింగ్ ఇచ్చారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ (Iran) పై దాడి చేసి పొరపాటు చేయవద్దని హెచ్చరించారు. ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. ఇజ్రాయెల్ భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. రెండు దేశాల మధ్య వైమానిక దాడులు రాత్రిపూట కొనసాగుతున్నాయని, యుద్ధం ఆరో రోజుకు చేరుకుందని చెప్పారు.
ఇజ్రాయెల్ దాడులకు కఠినంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. యుద్ధానికి టెహ్రాన్ లొంగిపోదని అన్నారు. తమ సాయుధ దళాలు మాతృ భూమిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald trump) ఇజ్రాయెల్ దేశానికి మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ ఇస్లామిక్ రిపబ్లిక్ లొంగిపోవాలని, టెహ్రాన్ ఆకాశంపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నామని ట్రూత్ సోషల్ పోస్టులో హెచ్చరించారు. ఖమేనీ ఎక్కడ ఉన్నాడనే సమాచారం కూడా తమ వద్ద ఉందని అతడిని చంపడం కాదు, కానీ ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పోస్ట్‌కు ఖమేనీ దీటుగా రిప్లై ఇచ్చాడు.






