- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Khamenei: ప్రపంచంలోని ముస్లిం దేశాల ఐక్యత అవసరం- ఖమేనీ
ప్రపంచంలోని ముస్లిం దేశాల ఐక్యత అవసరమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో జరిగిన సమావేశం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోని ముస్లిం దేశాల ఐక్యత అవసరమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో జరిగిన సమావేశం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనా సమస్యపై పాకిస్తాన్ వైఖరిని ఖమేనీ ప్రశంసించారు. అంతేకాకుండా, ఇజ్రాయెల్ తో అమెరికా మద్యవర్తిత్వం వహించిన అబ్రహం ఒప్పందాలపైన సంతకం చేసిన అరబ్ దేశాలను విమర్శించారు. మరోవైపు, పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్ ఇరాన్ పర్యటనలో ఉన్నారు. ఈనేపథ్యంలోనే ఖమేనీతో భేటీ అయ్యారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి కోసం ఇరాన్ (Iran) చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ప్రశంసించారు. అంతేకాకుండా, భేటీకి సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ షరీఫ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ముస్లిం సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఖమేనీతో చర్చించినట్లు తెలిపారు. ప్రాంతీయ స్థిరత్వం, బలమైన ద్వైపాక్షిక చర్చలు జరిగాయన్నారు. దక్షిణాసియాలో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ పోషించిన మధ్యవర్తిత్వాన్ని ఆయన ప్రశంసించారు. ముస్లిం దేశాల్లో శాంతి, సామరస్యం, అభివృద్ధికి తమ సహకారం అందిస్తామని షరీఫ్ ఈ సందర్భంగా వెల్లడించారు. పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్, ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ ఆయన వెంట ఉన్నారు.
ఇరాన్ అధ్యక్షుడితో భేటీ..
దీనికి ముందు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్‌తో షరీఫ్ భేటీ అయ్యారు. కశ్మీర్, సింధూ జలాల సమస్య సహా అన్ని వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పెజిష్కియాన్ సూచించారు. వాణిజ్యం, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై భారత్ తో మాట్లాడేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు. మరోవైపు, భారత్‌తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు షరీఫ్ తెలిపారు. న్యూఢిల్లీ యుద్ధ మార్గాన్ని ఎంచుకుంటే తామూ దీటుగానే స్పందిస్తామన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తమకు అప్పగిస్తేనే పాకిస్థాన్ (Pakistan)తో చర్చలు జరుపుతామని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది.ప్రపంచంలోని ముస్లిం దేశాల ఐక్యత అవసరం






