ఖలిస్తానీ మాడ్యూల్ గుట్టురట్టు.. ఆరుగురు బబ్బర్ ఖల్సా కార్యకర్తలు అరెస్ట్

by Naga Rani Yarlagadda |

పాకిస్తాన్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్వీందర్ సింగ్ రిండా (Harwinder Singh Rinda)కు చెందిన విదేశీ ఆధారిత హ్యాండ్లర్లు మణీందర్ బిల్లా & మన్ను అగ్వాన్ నిర్వహిస్తున్న BKI టెర్రర్ మాడ్యూల్‌ను బటాలా పోలీసులు ఛేదించారని పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ తెలిపారు.

ఖలిస్తానీ మాడ్యూల్ గుట్టురట్టు.. ఆరుగురు బబ్బర్ ఖల్సా కార్యకర్తలు అరెస్ట్
X

దిశ, వెబ్‌‌డెస్క్: పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖలిస్తానీ ఉగ్రవాద మాడ్యూల్‌ను పంజాబ్ పోలీసులు ఛేదించారు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) సంస్థకు చెందిన ఆరుగురు కార్యకర్తలను అరెస్టు చేసినట్లు రాష్ట్ర పోలీస్ చీఫ్ మంగళవారం తెలిపారు.

పాకిస్తాన్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్వీందర్ సింగ్ రిండా (Harwinder Singh Rinda)కు చెందిన విదేశీ ఆధారిత హ్యాండ్లర్లు మణీందర్ బిల్లా & మన్ను అగ్వాన్ నిర్వహిస్తున్న BKI టెర్రర్ మాడ్యూల్‌ను బటాలా పోలీసులు ఛేదించారని పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. బీకేఐ కార్యకర్తలైన రోహన్ అలియాస్ జతిన్ కుమార్, బరీందర్ సింగ్ అలియాస్ సాజన్, రాహుల్ మాసిహ్, రోహిత్ అలియాస్ అబ్రహం, సోహిత్, సునీల్ కుమార్ లను అరెస్ట్ చేశారు. ఒక బెల్ట్ షాపు వెలుపల మాడ్యూల్ గ్రెనేడ్ దాడికి కూడా యత్నించింది. అరెస్టైన నిందితులు పోర్చుగల్‌కు చెందిన మణీందర్ బిల్లా, అమెరికాలో వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియా అరెస్టు తర్వాత ఇటీవల ఆపరేషనల్ కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించిన బికెఐ సూత్రధారి మన్ను అగ్వాన్ నుండి ప్రత్యక్ష సూచనలు అందుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్లో 30 బోర్ పిస్టల్స్ ను స్వాధీనం చేసుకుని, భారతీయ న్యాయ సంహిత (BNS), చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Next Story