DNA Test: రెడ్‌ఫోర్ట్ బ్లాస్ట్ కేసులో కీలక మలుపు.. తల్లితో మ్యాచ్ అయిన నిందితుడి డీఎన్‌ఏ శాంపిల్స్

by Ramesh Naini |   (  Updated:2025-11-13 03:47:49  IST  )

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్‌ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

DNA Test: రెడ్‌ఫోర్ట్ బ్లాస్ట్ కేసులో కీలక మలుపు.. తల్లితో మ్యాచ్ అయిన నిందితుడి డీఎన్‌ఏ శాంపిల్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Red fort blast case) ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్‌ ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడిగా భావిస్తున్న.. బ్లాస్ట్‌లో మరణించిన వ్యక్తి డాక్టర్ ఉమర్ ఉన్ నబీ (Dr Umar) అని గురువారం డీఎన్ఏ పరీక్షలు నిర్ధారించాయి. మృతదేహం నుండి సేకరించిన డీఎన్‌ఏ నమూనా నిందితుడి తల్లితో సరిపోలినట్లు ఫోరెన్సిక్‌ డీఎన్‌ఏ పరీక్షలు వెల్లడించాయి. పేలుడు సంభవించిన సమయంలో ఉమర్ కారు నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. పేలుడు అనంతరం నిందితుడి కాలు స్టీరింగ్‌ వీల్‌, యాక్సిలేటర్‌ మధ్య ఇరుక్కుపోయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

AIIMS‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో నిర్వహించిన డీఎన్‌ఏ విశ్లేషణలో నిందితుడి ఉమర్‌ శాంపిల్స్ ఆయన తల్లి నమూనాతో సరిపోవడంతో గుర్తింపు ఖరారు అయినట్లు ఢిల్లీ పోలీసుల సమాచారం. ఈ కేసులో మొత్తం 21 డీఎన్ఏ నమూనాలను పరీక్షకు పంపగా, ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలు గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Next Story