- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిర్ ఇండియా ప్రమాదంపై యాజమాన్యం కీలక ప్రకటన..!
అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా ( Air India) పెను ప్రమాదంపై తాజాగా యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఈ పెను

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా ( Air India) పెను ప్రమాదంపై తాజాగా యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఈ పెను ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది టాటా. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న... ఎయిర్ ఇండియా 171 విమానం ప్రమాదానికి గురి కావడం విషాదకరమని పోస్ట్ పెట్టింది. అలాగే మృతుల కుటుంబాలకు అటు క్షతగాత్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది టాటా గ్రూప్ ( Tata Group).
బాధితులకు అండగా ఉంటామని కూడా ప్రకటన చేసింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు వెల్లడించింది.బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కూడా స్పష్టం చేసింది టాటా గ్రూప్. ఈ ప్రమాదంపై విచారణ చేయిస్తామని... ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని వివరించింది. ఇక ఈ ప్రమాద సంఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 169 మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే 53 మంది బ్రిటన్ జాతీయులు... ఉన్నట్లు సమాచారం అందుతుంది.
ఏడు మంది పోర్చుగీస్ అలాగే ఓ కెనడియన్ ఉన్నాడని ఎయిర్ ఇండియా ప్రకటన చేసిందట. ఇక ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 110 మంది మరణించినట్లు చెబుతున్నారు. ఇక అటు అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా ( Air India) పెను ప్రమాదం నేపథ్యంలో రంగంలోకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దిగారు. హుటా హుటిన అహ్మదాబాద్ బయలు దేరారు.
With profound sorrow I confirm that Air India Flight 171 operating Ahmedabad London Gatwick was involved in a tragic accident today. Our thoughts and deepest condolences are with the families and loved ones of all those affected by this devastating event.
— Tata Group (@TataCompanies) June 12, 2025
At this moment, our…






