- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amit Shah: దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? ఎన్ఐఏ, ఐబీ చీఫ్ లతో అమిత్ షా కీలక భేటీ
ఢిల్లీ పేలుడు ఘటనపై కర్తవ్యభవన్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక భేటీ నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు (Delhi Red Fort) ఘటనలో ఎన్ఐఏ విచారణ (NIA investigation) కొనసాగుతోంది. ఈ అంశంలో తవ్విన కొద్ది నివ్వెరపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర హోంశాఖ (Amit Shah) కార్యాలయంలో కీలక భేటీ జరిగింది. ఎన్ఐఏ, ఐబీ చీఫ్‍లతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఢిల్లీ పేలుడు దర్యాప్తుపై ఈ సందర్భంగా అమిత్ షా ఆరా తీశారు. ఇవాళ సాయంత్రం సీసీఎస్ కీలక సమావేశం జరగబోతోంది. మరో వైపు ఈ ఘటన దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేస్తూ దర్యాప్తు నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంత్రిత్వ శాఖ ఏఎన్ఐ ఎజెన్సీని ఆదేశించింది. అలాగే పేలుడు స్థలం నమూనాలను విశ్లేషించి, సరిపోల్చి నివేదికను వెంటనే అందించాలని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)ను ఆదేశించారు.
ముమ్మర తనిఖీలు:
పేలుడు ఘటన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. నగరంలోకి ప్రవేశించే ప్రధాన రహదారులపై వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పర్యాటక ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా మందిరాలు వంటి జన సంవర్దక ప్రదేశాల్లో గస్తీ పెంచారు. అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. జిల్లా యూనిట్లు, ప్రత్యేక విభాగాలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు.






