- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు.. సిగ్నల్ యాప్‌లో చాట్, సూసైడ్ బాంబ్ బ్లాస్టులకు ప్లాన్
దేశంలో భారీ ఉగ్రకుట్రకు ప్లాన్ చేసిన ఐదుగురు ఉగ్రవాదుల్ని ఢిల్లీ పోలీసులు బుధ, గురువారాల్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో భారీ ఉగ్రకుట్రకు ప్లాన్ చేసిన ఐదుగురు ఉగ్రవాదుల్ని ఢిల్లీ పోలీసులు బుధ, గురువారాల్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వారంతా ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కొందరు నేతల్ని టార్గెట్ చేసి ఆత్మాహుతి దాడులకు స్లాన్ చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఆత్మాహుతి జాకెట్లు, బాంబుల్ని కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. అరెస్టైన ఉగ్రవాదులతో 40 మంది ఉగ్రసభ్యులు చర్చలు జరిపినట్లు గుర్తించామని, అయితే ఆ విషయాలు బయటకు రాకుండా సిగ్నల్, ఇతర చాటింగ్ యాప్ లను వాడినట్లు చెప్పారు.
ఉగ్రవాదులు ప్రజల్లో స్లీపర్ సెల్స్ గా ఉంటూ.. ఆయుధాలు, బాంబుల్ని ఉగ్రముఠాలకు సరఫరా చేస్తున్నారని, యువత ఉగ్రవాదం వైపు మళ్లేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఐసిస్ స్లీపర్ సెల్ విభాగంతో వీరికి సంబంధాలున్నట్లు గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. ఐఈడీ బాంబుల తయారీలో వాడే ముడిపదార్థాలు, పిస్టల్, ల్యాప్ టాప్స్, మాస్కులు, సెల్ఫోన్స్, క్యాష్, హైడ్రోక్లోరిక్, నైట్రిక్ ఆమ్లాలు, సల్ఫర్ పౌడర్, వైర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.






