ఏఐ కంటెంట్‌పై కేంద్రం కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-10 15:37:11  IST  )

ఏఐ కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఏఐ కంటెంట్‌పై కేంద్రం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఐ కంటెంట్‌(AI Content)పై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. లేబుల్ తప్పనిసరి చేసింది. ఏఐ కంటెంట్‌ను గుర్తించేందుకు ప్రత్యేక టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు మంగళవారం కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌ను ఉపయోగించి విపరీతంగా వీడియోలు, ఫొటోలు తయారు చేస్తున్నారు క్రియేటర్లు. వీటితో విపరీతంగా ఫేక్ న్యూస్ ప్రసారం అవుతూండటంతో కట్టడి కోసం మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఏఐ(Artificial intelligence) కంటెంట్ సృష్టికర్తలకు లైసెన్సింగ్ ఉండాలని ఇటీవలే కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తాజాగా పార్లమెంట్‌కు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే AI ద్వారా సృష్టించిన కంటెంట్‌కు లేబులింగ్‌ను తప్పనిసరి చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

కలియుగం కాదు.. క్వాంటం నెట్వర్క్ యుగం

Next Story