జమ్మూకశ్మీర్‌లో కీలక పరిణామం.. లొంగిపోయిన ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-29 04:35:43  IST  )

జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని షోపియాన్ (Shopian) జిల్లాలోని ఇమామ్ సాహిబ్‌లోని బస్కుచన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం భద్రతా దళాలలకు అందింది.

జమ్మూకశ్మీర్‌లో కీలక పరిణామం.. లొంగిపోయిన ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని షోపియాన్ (Shopian) జిల్లాలోని ఇమామ్ సాహిబ్‌లోని బస్కుచన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం భద్రతా దళాలలకు అందింది. దీంతో ఇండియన్ ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు, 178 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ (CRPF) దళాలు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే వారి ఎదుట హైబ్రిడ్ మిలిటెంట్లు ఇర్ఫాన్ బషీర్ (Irfan Bashir), ఉజైర్ సలామ్ (Uzair Salam) ఇద్దరు లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు లొంగిపోయారు. ఈ క్రమంలోనే వారి నుంచి రెండు ఏకే 56 రైఫిళ్లు, 4 మ్యాగజైన్లు, 102 రౌండ్స్‌ (7.62x39mm), 2 హ్యాండ్‌ గ్రనేడ్లు, రెండు పౌచ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు లోకల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

Next Story