కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. యువతకు భారీ గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేబినెట్(Union Cabinet) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. యువతకు భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేబినెట్(Union Cabinet) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపారు. దేశ వ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలతో పాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేశారు. అంతేగాకుండా.. రీసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్‌కు ఆమోదం లభించింది. రూ.లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రీసెర్చ్ రంగంలో ప్రయివేటు పెట్టుబడులకు పోత్సాహంతో పాటు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి అవకాశాల కోసం రూ.1.07 లక్షల కోట్లు కేటాయించారు. అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని ఫిక్స్ అయ్యారు. పరమకుడి-రామనాథపురం జాతీయ రహదారికి రూ.1853 నిధులు కేటాయించారు.

Next Story