Central Cabinet: రోదసీలోకి మానవుడిని పంపే ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

by Gantepaka Srikanth |
Central Cabinet: రోదసీలోకి మానవుడిని పంపే ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేబినెట్(Central Cabinet) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో టెక్నాలజీని ప్రొత్సహించేందుకు పలు పథకాలు తీసుకురావాలని నిర్ణయించారు. రోదసీలోకి మానవుడిని పంపే ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్, ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం, త్వరలో వేతన సంఘానికి చైర్మన్ నియామకానికి ఆమోదం తెలిపారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట(Sriharikota)లో మూడో లాంచ్ ప్యాడ్(Third Launch Pad) నిర్మాణ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కక్షలో భారీ ఉపగ్రహాలు ప్రవేశ పెట్టడానికి ఈ లాంచ్ ప్యాడ్‌ను నిర్మించమన్నారు. రూ.3985 కోట్లతో షార్‌లో లాంచ్ ప్యాడ్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ఎన్జీఎల్వీ రాకెట్ల(NGLV Rocket) ప్రయోగించనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed