- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. జైశంకర్ భద్రత పెంపు
ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ట్రంప్ జోక్యం తో పులిస్టాప్ పడింది. అయినప్పటికి ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ట్రంప్ జోక్యం తో పులిస్టాప్ పడింది. అయినప్పటికి ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry) కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ భద్రతను పెంచాలని (Minister Jaishankar's security increased) నిర్ణయించారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జైశంకర్‌కు ప్రస్తుతం జెడ్ కేటగిరీ భద్రత (Z category safety) ఉంది. ఇందులో 22 మంది సిబ్బంది. 4-6 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కమాండోలు, స్థానిక పోలీసులు, కనీసం ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉన్నాయి.
తాజా నిర్ణయంతో, ఆయన కాన్వాయ్‌లో రెండు అదనపు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను (Two additional bulletproof vehicles) చేర్చనున్నారు. మొత్తం భద్రతను మరింత బలోపేతం చేశారు. ఢిల్లీలోని జైశంకర్ నివాసం, కార్యాలయం చుట్టూ కఠినమైన నిఘా అదనపు స్పాటర్లను నియమించారు. ఒక ఎస్కార్ట్ వాహనంతో పాటు కొత్త కాల్ సైన్ యాడ్ చేయనున్నారు. కేంద్ర గూఢచార సంస్థలు జైశంకర్ భద్రతపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో, భారత్-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు, ఆయన విదేశాంగ విధానంలో కీలక పాత్ర కారణంగా ఈ చర్యలు సిఫార్సు చేశారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా ఆదివారం పాకిస్తాన్‌పై బహిరంగంగా విమర్శలు చేసిన వీఐపీల భద్రతపై చర్చించడానికి సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో జైశంకర్ భద్రత కూడా పరిగణనలోకి తీసుకోబడింది.






