- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ - ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
భారత్-ఇజ్రాయెల్ దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఏఐతో పాటు వ్యవసాయరంగంలో ఒప్పందాలు కుదిరాయి.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - ఇజ్రాయెల్(India - Israel) దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఏఐతో పాటు వ్యవసాయరంగంలో ఒప్పందాలు కుదిరాయి. త్వరలో రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ సైతం జరుగనుంది. మొత్తం 27 రంగాల్లో భారత్-ఇజ్రాయెల్ పరస్పర సహకారం, యూపీఐ చెల్లింపుపైనా ఇరుదేశాల మధ్య ఎంవోయూ, భారత్-ఇజ్రాయెల్ ఎకనామిక్ ఫోరం ఏర్పాటు, అణు ఇంధన రంగంలో రెండుదేశాల మధ్య సహకారం, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయం, ఇరుదేశాల మధ్య 100 ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఏర్పాటు సహా పలు కీలక ఒప్పందాలు జరిగాయి.
మరోవైపు ఇజ్రాయెల్ పార్లమెంట్ 'నెసెట్'ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారు. దాంతో పాటు ఇజ్రాయెల్ సోషల్ మీడియా ట్రెండ్స్‌లో మోడీ పేరు టాప్ 3లో నిలవడం విశేషం. ఈ పర్యటన ద్వారా అటు ఉగ్రవాదంపై పోరాటం, ఇటు శాంతి చర్చల విషయంలో రెండు దేశాలు ఒకే తాటిపై ఉన్నాయని ప్రపంచానికి మరోసారి స్పష్టమైంది. మోడీ ఇజ్రాయెల్ పర్యటన ముగింపు సందర్భంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ పర్యటనను ఆయన ‘అద్భుతమైనది’గా అభివర్ణించారు. ఈ పర్యటన కేవలం రెండు దేశాల మధ్య ఒప్పందాలకే పరిమితం కాలేదని, ఇది రెండు మహత్తర మేధస్సులూ, హృదయాలూ కలిసిన సందర్భమని ఆయన వ్యాఖ్యానించారు.






