- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూతురిపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి.. కోర్టు సంచలన తీర్పు
పోక్సో కేసులో కేరళ కోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. ప్రియుడితో కలిసి 12 ఏళ్ల కూతురిని అత్యాచారం చేయించిన తల్లి కేసులో దోషులకు 180ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 11.7 లక్షల జరిమానా విధించింది.

దిశ, వెబ్ డెస్క్ : పోక్సో కేసులో కేరళ కోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. ప్రియుడితో కలిసి 12 ఏళ్ల కూతురిని అత్యాచారం చేయించిన తల్లి కేసులో దోషులకు 180ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 11.7 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని బాధితురాలికి పరిహారంగా ఇవ్వాలని.. ఒకవేళ పరిహారం చెల్లించలేకపోతే అదనంగా 22 నెలల జైలు శిక్ష ఉంటుందని తీర్పునిచ్చింది. మంజేరి, కోజికోడ్ జిల్లాలోని ప్రత్యేక బాలల రక్షణ చట్టం (POCSO) కోర్టు ఈ తీర్పునిచ్చింది. పోక్సో సర్వైవర్ సహాయం పథకం కింద బాధితురాలికి అదనపు పునరావాస సహాయం అందించాలని లీగల్ సర్వీసెస్ అథారిటీకి సూచించింది.
కాగా 2019 నుంచి 2021 అక్టోబర్ వరకు బాలికపై అత్యాచారం జరిగింది. అంటే బాలికకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లి తన ప్రియుడితో బిడ్డపై అత్యాచారం చేయించింది. తిరువనంతపురంలో భర్తతో ఉండే ఆమె.. ప్రియుడితో పాలక్కాడ్‌కు బిడ్డతో కలిసి పారిపోయింది. అక్కడే ఈ ఘాతుకానికి పాల్పడింది. రెండేళ్లపాటు పదే పదే బాలికను రేప్ చేయించడమే కాదు.. పాప మౌనంగా ఉండేందుకు ఆల్కహాల్ తాగించి, బ్రెయిన్‌లో ఇంప్లాంటెడ్ చిప్ ఉందని భయపెట్టింది.






