కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచిందంటే..?

by Malleboina Mahesh |

కేరళ స్థానిక సంస్థలకు ఈ నెల 9, 11 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది ఈ పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ రోజు జరిగింది.

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: కేరళ స్థానిక సంస్థలకు ఈ నెల 9, 11 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది ఈ పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ రోజు జరిగింది. ఈ ఎన్నికల తుది ఫలితాల సరళి (TREND) ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రంట్ (UDF) రాష్ట్రవ్యాప్తంగా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. మొత్తం 17,337 వార్డుల్లో యూడీఎఫ్ 7,996 వార్డులను గెలుచుకుంది. అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) 6,555 వార్డులు గెలిచి రెండో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యూడీఎఫ్ బలంగా ఉంది. గ్రామ పంచాయితీలలో 7,996 వార్డులు, బ్లాక్ పంచాయితీలలో 1,241 స్థానాలు దక్కించుకుంది. అయితే, జిల్లా పంచాయితీలలో మాత్రం యూడీఎఫ్ 165 స్థానాలతో ఎల్‌డీఎఫ్‌ (103 స్థానాలు) కంటే ముందంజలో ఉంది.

అలాగే మొత్తం 941 గ్రామ పంచాయతీల్లో యూడీఎఫ్ 505, ఎల్డీఎఫ్ 340, ఎన్డీయే 64, ఇతరులు 6 గ్రామపంచాయితీల్లో గెలుపొందారు. అలాగే మొత్తం 162 బ్లాక్ పంచాయితీల్లో 79 యూడీఎఫ్, 63 ఎల్డీఎఫ్, గెలుచుకోగా.. 10 టై అయ్యాయి. అలాగే జిల్లా పంచాయితీల్లో 7 యూడీఎఫ్, 7 ఎల్డీఎఫ్ కైవసం చేసుకున్నాయి. అలాగే 87 మున్సిపాలిటీల్లో 54 యూడీఎఫ్, 28 ఎల్డీఎఫ్, 2 ఎన్డీయే కైవసం చేసుకొగా ఒకటి టై అయింది. అలాగే 6 కార్పొరేషన్లలో 4 యూడీఎఫ్, 1 ఎల్డీఎఫ్ కైవసం చేసుకోగా కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలో బీజేపీ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూడీఎఫ్‌కు బలమైన సానుకూల సంకేతాలను అందిస్తున్నాయి.

బీజేపీ (NDA) పురోగతి, ఇతరుల ప్రభావం

ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూడా తమ స్థానాలను మెరుగుపరుచుకుంది. ఎన్‌డీఏ కూటమి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,444 వార్డుల్లో విజయం సాధించింది. పట్టణ ప్రాంతాల్లో పురోగతిని చూపిస్తూ, మున్సిపాలిటీల్లో 324 వార్డులను, కార్పొరేషన్లలో 93 వార్డులను కైవసం చేసుకుంది. ఇతర పార్టీలు (OTH) 1,296 వార్డుల్లో గెలిచాయి. కార్పొరేషన్ విభాగంలో యూడీఎఫ్ (187), ఎల్‌డీఎఫ్ (125), ఎన్‌డీఏ (93) స్థానాలు దక్కించుకోగా, మున్సిపాలిటీలలో యూడీఎఫ్ 1,458 స్థానాలు, ఎల్‌డీఎఫ్ 1,100 స్థానాలతో ప్రధాన పోటీదారులుగా నిలిచాయి. రాష్ట్ర రాజకీయాల్లో తృతీయ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఈ ఎన్నికల ద్వారా తమ అస్తిత్వాన్ని కొంత వరకు పెంచుకున్నట్లు స్పష్టమవుతోంది.

Next Story