- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Operation Numkhor: కేరళ హైకోర్టులో దుల్కర్ సల్మాన్‌కు ఊరట
నటుడు దుల్కర్ సల్మాన్ కు కేరళ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: నటుడు దుల్కర్ సల్మాన్ కు కేరళ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఇటీవల ఆపరేషన్ నమ్ ఖోర్ పేరుతో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన సోదాల్లో.. దుల్కర్ కారును సీజ్ చేసిన విషయం తెలిసిందే. తన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ను టెంపరరీగా విడుదల చేసేందుకు కస్టమ్స్ అధికారులను సంప్రదించడానికి కేరళ హైకోర్టు అనుమతినిచ్చింది. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 110A కింద దుల్కర్ దరఖాస్తును స్వీకరించిన వారంరోజుల్లోగా కస్టమ్స్ చట్టం కింద అడ్జుడికేటరీ అథారిటీ నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
కారును అధికారులు రిలీజ్ చేసేటపుడు అవసరమైన షరతులు విధించవచ్చునని జస్టిస్ జియాద్ రెహమాన్ పేర్కొన్నారు. ఒకవేళ దుల్కర్ పిటిషన్ రిజెక్ట్ అయితే.. తిరిగి హైకోర్టుకు వెళ్లవచ్చని కూడా స్పష్టం చేశారు. పన్ను ఎగవేత, నకిలీ రిజిస్ట్రేషన్ల ద్వారా భూటాన్ నుండి వాహనాలను అక్రమంగా దిగుమతి చేసుకోవడాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ నమ్‌ఖోర్‌లో భాగంగా దుల్కర్ నివాసంపై నిర్వహించిన దాడి తర్వాత ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుల్కర్ ల్యాండ్ రోవర్‌తో పాటు, సెప్టెంబర్ 23న కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోని ఏడు ప్రదేశాల నుండి కస్టమ్స్ అధికారులు మరో 11 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.






