మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అందిస్తున్న ప్రభుత్వం..

by Sujitha Rachapalli |

గోవా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే నేతృత్వంలో మహిళలకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) చికిత్సను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆర్థిక సమస్యలతో

మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అందిస్తున్న ప్రభుత్వం..
X

దిశ, వెబ్ డెస్క్: గోవా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే నేతృత్వంలో మహిళలకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) చికిత్సను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆర్థిక సమస్యలతో సంతానోత్పత్తి చికిత్సకు నోచుకోని వారికి సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ప్రోగ్రాముల ద్వారా నిధులు సమకూర్చబడగా.. ఈ ప్రయత్నం భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం కానుంది. అధునాతన సంతానోత్పత్తి చికిత్స సామాన్యులకు అందుబాటులోకి రావడానికి ఒక గ్లోబల్ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తుంది.

కాగా భారతదేశంలో గర్భధారణ రేట్లు తగ్గుతున్నాయి. 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) ప్రకారం 2.1 నుంచి 2.0కి క్రిందికి పడిపోయాయి. ప్రభుత్వ విధానాలు, సామాజిక-ఆర్థిక మార్పులు, కుటుంబ ప్రణాళికపై మారుతున్న సాంస్కృతిక నాగరికతల వల్ల ఇలా జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగానూ సంతానోత్పత్తి రేటు తగ్గుతుండగా.. ఆయా దేశాలు పునరుత్పత్తి రేటు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

Next Story