రోడ్డు ప్రమాదంలో డబ్బున్న బిచ్చగాడు మృతి

by Naga Rani Yarlagadda |

డబ్బుంటే బిచ్చగాడు ఎందుకవుతాడని డౌట్ వచ్చిందా? ఇక్కడ అదే ట్విస్ట్. రోడ్డు ప్రమాదంలో బిచ్చగాడు మరణించాక.. అతని డెడ్ బాడీ పక్కన ఉన్న కంటేనర్ ను తెరిచి చూసిన పోలీసులు షాకయ్యారు.

రోడ్డు ప్రమాదంలో డబ్బున్న బిచ్చగాడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: డబ్బుంటే బిచ్చగాడు ఎందుకవుతాడని డౌట్ వచ్చిందా? ఇక్కడ అదే ట్విస్ట్. రోడ్డు ప్రమాదంలో బిచ్చగాడు మరణించాక.. అతని డెడ్ బాడీ పక్కన ఉన్న కంటేనర్ ను తెరిచి చూసిన పోలీసులు షాకయ్యారు. అందులో లక్షల రూపాయల నగదు కనిపించింది. ఈ ఘటన కేరళలోని అలప్పుజాలో జరిగింది. ఆ ప్రాంతవాసులకు అతను సుపరిచితుడు. రోజూ అక్కడే అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం (జనవరి 5) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతని పేరును అనిల్ కిశోర్ గా నమోదు చేసుకున్నారు.

ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లిన కిశోర్.. మంగళవారం ఉదయం ఓ షాపు వద్ద విగతజీవిగా కనిపించాడు. అతని చనిపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ క్రమంలో అతని డెడ్ బాడీ వద్ద ఒక కంటేనర్ ను గుర్తించారు. అందులో ఏం ఉందో చూసేందుకు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. లోకల్ పంచాయతీ సభ్యుడు ఫిలిప్ ఉమ్మన్ ఆధ్వర్యంలో దానిని ఓపెన్ చేసి చూడగా.. నోట్ల కట్టలు కనిపించాయి. వాటిని లెక్కించగా మొత్తం విలువ రూ.4.5 లక్షలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ నగదులో ఇప్పటికే రద్దయిన రూ.2000 నోట్లు, విదేశీ కరెన్సీ కూడా ఉందని పోలీసులు తెలిపారు. ప్లాస్టిక్ టిన్నుల్లో డబ్బును దాచి పెట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ నగదును కోర్టు జమ చేస్తామని చెప్పారు. కాగా.. తమ కాలనీలో యాచన చేస్తూ బ్రతికిన వ్యక్తి వద్ద అంత డబ్బు ఉందని తెలిసి స్థానికులు అవాక్కయ్యారు.

Next Story