ఎస్ఐఆర్‌ను వ్యతిరేకిస్తు కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

by Malleboina Mahesh |

కేరళ అసెంబ్లీ భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వ్యాయామాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.

ఎస్ఐఆర్‌ను వ్యతిరేకిస్తు కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ శాసనసభ కీలక నిర్ణయ తీసుకుంది. భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వ్యాయామాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మాణానికి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష సభ్యులు కూడా మద్దతు ఇచ్చారు. అలాగే ప్రతిపక్షాలు చేసిన పలు సూచనలను చేర్చిన తర్వాత పూర్తి మద్దతు తెలిపింది. దీంతో SIR కు వ్యతిరేకంగా సీఎం పినరయి విజయన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మాణం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.

అలాగే SIR ప్రక్రియను జాతీయ జనాభా రిజిస్టర్ (NPR) అమలుకు ఒక “బ్యాక్‌డోర్ ప్రయత్నం”గా భావించవచ్చని కేరళ శాసనసభ ఆందోళన వ్యక్తం చేసింది. బీహార్‌లో జరిగిన సందర్భాన్ని ఉదాహరిస్తూ.. ఓటర్ల జాబితా నుండి ఏకపక్ష తొలగింపులు జరిగితే దేశవ్యాప్తంగా మినహాయింపు రాజకీయాలు విస్తరించే అవకాశం ఉందని శాసనసభ కేరళ హెచ్చరించింది. కాగా ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా ఆమోదం పొందిన ఈ తీర్మానాన్ని స్పీకర్ కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.

Next Story