- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Donald Trump: ట్రంప్ అలా చూడ్డంతో భయం వేసింది.. అమెరికన్ యాక్టర్ సంచలన ఆరోపణలు
దాదాపు మూడు దశాబ్దాల క్రితం డోనాల్డ్ ట్రంప్‌పై దర్యాప్తు చేయాలని ఎఫ్‌బీఐని కోరినట్టు చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా చర్చకు దారితీసిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం వ్యవహారంలో ఫైల్స్‌ను విడుదల చేస్తానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన్నే దెబ్బతీయనున్నాయి. తాజాగా ఈ ఎప్‌స్టీన్ వ్యవహారం గురించి కొన్నేళ్ల క్రితమే దర్యాప్తు చేయాలని కోరిన ప్రముఖ అమెరికన్ యాక్టర్ మారియా ఫార్మర్ ఈసారి ఏకంగా ట్రంప్‌పైనే సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం డోనాల్డ్ ట్రంప్‌పై దర్యాప్తు చేయాలని ఎఫ్‌బీఐని కోరినట్టు చెప్పారు. 1995లో ఓ సందర్భంలో తనను ఎప్‌స్టీన్ మాన్‌హాట్టన్‌లోని ఆఫీసులో కలవాలని చెప్పారు. ఆ సమయంలో తాను రన్నింగ్ షార్ట్స్‌తోనే ఆఫీస్‌కు వెళ్లాను. అప్పుడే డొనాల్డ్ ట్రంప్ బిజినెస్ సూట్‌లో అక్కడకు వెచ్చారు. తనకు దగ్గరలోనే నిలబడి అదో రకంగా చూశాడని ఆమె వివరించింది. ట్రంప్ తన కాళ్ళ వైపే చూస్తూ ఉండటంతో తనకు భయం వేసిందని, అప్పుడే అక్కడకు వచ్చిన ఎప్‌స్టీన్ 'ఆమె మీకోసం ఇక్కడకు రాలేదని ' చెప్పారు. ఆ తర్వాత వారిద్దరూ ఆ గది నుంచి బయటకు వెళ్లారు. ఆ సమయంలో తనకు 16 ఏళ్లు ఉంటాయని ట్రంప్ అనుకున్నట్టు తెలిపారు. అయితే, ట్రంప్ ఇతర మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని తాను ఎప్పుడూ చూడలేదని, కానీ ఆ సందర్భంలో ఆ ఘటన తీవ్రంగా కలతపెట్టేదని మారియా ఫార్మర్ వెల్లడించారు.
దీనికి సంబంధించి మారియా ఫార్మర్ వ్యాఖ్యలపై వైట్‌హౌస్ వర్గాలు స్పందించాయి. ట్రంప్ చాలాకాలం క్రితమే ఎప్‌స్టీన్‌తో స్నేహాన్ని వదులుకున్నారని, అంతేకాకుండా ఆయన ఎప్పుడూ ఎప్‌స్టీన్ ఆఫీసుకు వెళ్లలేదని స్పష్టం చేసిందని వైట్‌హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చెప్పారు. ఎప్‌స్టీన్ ప్రవర్తన కారణంగా విసుగు చెంది ట్రంప్ అతన్ని క్లబ్ నుంచి బయటకు పంపించేశారని పేర్కొన్నారు.






