Ken Betwa Project : ‘కెన్-బెట్వా’ ప్రాజెక్టుతో పన్నా టైగర్ రిజర్వుకు ముప్పు : కాంగ్రెస్

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధాని మోడీ బుధవారం ఉదయం శంకుస్థాపన చేసిన ‘మధ్యప్రదేశ్‌లోని కెన్ నది - ఉత్తరప్రదేశ్‌లోని బెట్వా నది అనుసంధాన ప్రాజెక్టు’(Ken Betwa Project)పై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్(Jairam Ramesh) అభ్యంతరం వ్యక్తం చేశారు.

Ken Betwa Project : ‘కెన్-బెట్వా’ ప్రాజెక్టుతో పన్నా టైగర్ రిజర్వుకు ముప్పు : కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధాని మోడీ బుధవారం ఉదయం శంకుస్థాపన చేసిన ‘మధ్యప్రదేశ్‌లోని కెన్ నది - ఉత్తరప్రదేశ్‌లోని బెట్వా నది అనుసంధాన ప్రాజెక్టు’(Ken Betwa Project)పై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్(Jairam Ramesh) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రాజెక్టు వల్ల మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌కు తీవ్ర ముప్పు పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు. కెన్-బెట్వా నదుల లింకింగ్ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే.. టైగర్ రిజర్వ్‌‌‌లోని 10 శాతం ప్రధాన భూభాగం ముంపునకు గురవుతుందన్నారు.

టైగర్ రిజర్వ్‌కు సాధ్యమైనంత తక్కువ నష్టాన్ని కలిగించేలా ఈ ప్రాజెక్టు డిజైన్ ఉండాలని జైరాం రమేశ్ చెప్పారు. దాదాపు 90కిపైగా పులులకు నెలవుగా మారిన పన్నా టైగర్ రిజర్వ్‌ పరిధిలోని కెన్ నదీ ప్రవాహంలో రెండు సొరంగాలను నిర్మించనున్నారని ఆయన తెలిపారు. కెన్-బెట్వా నదుల లింకింగ్ ప్రాజెక్టు వల్ల టైగర్ రిజర్వ్‌లోని 23 లక్షలకుపైగా చెట్లను కూడా కూల్చాల్సి వస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడే ముందు ఇలాంటి అంశాలకు ప్రధాని మోడీ పరిష్కారాలను చూపాలని జైరాం రమేశ్ సూచించారు.

Next Story