- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kejriwal : విద్యార్థులకు కేజ్రీవాల్ డబుల్ ధమాకా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం జోరందుకుంటుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం జోరందుకుంటుంది. పోటాపోటీగా ఎన్నికల హామీల(Election Promises)ను ప్రకటనలో ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఆమ్ ఆద్మీ(Aam Aadmi Party), బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలు మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ప్రచారాల్లో మునిగిపోయాయి. అధికార ఆమ్ ఆద్మీ.. ఇటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా ఢిల్లీ వాసులకు హామీల వర్షం కురిపిస్తున్నాయి.
మరోసారి ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ఇటీవల పూజారీ గ్రంథీ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రకటించారు. అర్చకులకు, గురుద్వారా గ్రంథీలకు నెలకు రూ.18వేల గౌరవ వేతనం ఇస్తామని వెల్లడించారు. వీటికి తోడుగా
కేజ్రీవాల్ రెండు కొత్త హామీలు ప్రకటించారు. ఎన్నికల తర్వాత ఢిల్లీ బస్సుల్లో పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ఉచిత ప్రయాణ వసతి పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఢిల్లీలో ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు.
అలాగే విద్యార్థులందరికీ మెట్రో ఛార్జీలో 50% రాయితీ అనేక పథకాలను ప్రకటించారు. అయితే విద్యార్థులకు 50శాతం టికెట్ రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలని ప్రతిపాదించారు. దీనిపై తాను ప్రధాని మోడీకి లేఖ రాస్తున్నట్లుగా తెలిపారు. ఆప్ ఎన్నికల ప్రణాళికలో మహిళా సమ్మాన్ యోజన, సంజీవన్ యోజన పథకాలు సహా 10పథకాలు ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.
అటు బీజేపీ సైతం ఢిల్లీ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తోంది. ఇక దేశ రాజధానిలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మోడల్ గా ఢిల్లీ ప్రజలపై హామీలు కురిపిస్తుంది. జీవన్ రక్ష యోజన పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.






