- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kejriwal: ఐదేళ్లలో నిరుద్యోగాన్ని అంతం చేస్తా.. ఆప్ చీఫ్ కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగాన్ని అంతం చేస్తానని కేజ్రీవాల్ హామీఇచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వచ్చే ఐదేళ్లలో దేశ రాజధానిలో నిరుద్యోగాన్ని అంతం చేస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) హామీఇచ్చారు. యువతకు ఉపాధి కల్పించడమే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. నిరుద్యోగ సమస్యను పారదోలడానికి ఇప్పటికే ఆమ్ బృందం ఒక చక్కటి ప్రణాళికలను రూపొందిస్తోందని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం రెండేళ్లలోపు 48,000 ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించిందని, అలాగే మూడు లక్షలకు పైగా ప్రయివేట్ రంగ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేసిందని కొనియాడారు. ఉపాధి అవకాశాలు ఎలా సృష్టించాలో ఆప్‌కు మాత్రమే తెలుసన్నారు. గత పదేళ్లలో ఉచిత విద్యుత్, వైద్యం, నీరు అందించడంపై దృష్టి సారించామన్నారు. ప్రజలకు ఎంతో నిజాయితీగా సేవచేశామని తెలిపారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.






